జూబ్లీహిల్స్, వెలుగు: ఈ నెల 21 నుంచి 25 వరకు ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియో సమీపంలో స్పిరిట్ కనెక్ట్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగనుంది. ఆర్ట్ కనెక్ట్ ఫౌండర్ మిహిక దగ్గుపాటి ఆధ్వర్యంలో చెన్నై తర్వాత హైదరాబాద్లో ఆర్ట్ కనెక్ట్ కనువిందు చేయనుంది. దేశంలోని సుమారు 34 మంది కళాకారుల ఆలోచనల నుంచి వెలువడిన ఆర్ట్స్ ఇందులో దర్శనమివ్వనున్నాయి.
