ద్రౌపది ముర్ముకు అపురూప బహుమతి

ద్రౌపది ముర్ముకు అపురూప బహుమతి

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ముకు ఆమె మరదలు అపురూపమైన బహుమతి ఇచ్చారు. ముర్ము తమ్ముడి భార్య సుక్రీ తుడు.. సంతాలీ చేనేత చీరను తీసుకొచ్చారు. ఆమె తమ్ముడు తరినిసెన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముర్ము సంతాలీ చీరను కట్టుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్రపతి భవన్ వర్గాలు తుది నిర్ణయం తీసుకోనుంది. ముర్ము ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆమె సోదరుడు తారిణిసేన్‌ తుడు, ఆయన భార్య సుక్రీ తుడు, ముర్ము కుమార్తె ఇతి శ్రీ, ఆమె భర్త గణేశ్‌.. ఈ నలుగురు మాత్రమే హాజరు కానున్నారు. చీరతోపాటు ఆమెకు ఇష్టమైన ‘అరిశ పీఠా’ (అరిసెలు) కూడా తీసుకెళ్తున్నట్లు ఆమె సోదరుడు చెప్పారు.

ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన పలువురు కళాకారుడు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ద్రౌపది ముర్ముపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. బెర్హం పూర్ కు చెందిన ఉడ్ కార్వింగ్ ఆర్టిస్ట్ అరుణ్ సాహూ చెక్కపై ద్రౌపది ముర్ము చిత్రాన్ని కార్వింగ్ చేశారు. 

గంజాంకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ సత్యనారాయణ మహా రానా ఇసుకతో శాండ్ యానిమేషన్ రూపంలో ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు.

భువనేశ్వర్ కు చెందిన ఎల్ ఈశ్వర్ రావు గాజు సీసాలో ద్రౌపది ముర్ము మినియేచర్ సృష్టించారు.