కళాకారులను ఆదుకోండి : గడ్డం సమ్మయ్య

కళాకారులను ఆదుకోండి :  గడ్డం సమ్మయ్య

 హైదరాబాద్, వెలుగు: చిందు యక్షగాన కళపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య కోరారు. మంగళవారం సమ్మయ్యతో పాటు పలువురు కళాకారులు మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎంతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

 కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితు లైన జంగా రాఘవరెడ్డి, నేరేళ్ల శారదు కూడా మంత్రి సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళల హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు గొప్ప వేదిక లభించిందని మంత్రితో శారద అన్నారు.