
మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగలింది. ఫాస్ట్ బయలర్ అరుంధతి రెడ్డికి గాయం కావడంతో ఆమెను మైదానం తీసుకెళ్లడానికి వీల్ చైర్ ను తీసుకొచ్చారు. తీవ్ర నొప్పితో చైర్ లోనే కూర్చుని మైదానం వీడుతున్న ఫోటోలు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్ర విచారానికి గురి చేస్తున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అరుంధతి రెడ్డికి గాయమైంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.
హీథర్ నైట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అరుంధతి ఎడమ కాలు ట్విస్ట్ అయింది. నొప్పితో వెంటనే కింద పడిపోయింది. ఆమె పరిస్థితిని గమనించిన ఫిజియో వెంటనే గ్రౌండ్ లోకి వచ్చి చికిత్స చేశారు. నొప్పి తగ్గకపోవగా.. ఈ టీమిండియా పేసర్ నడవడానికి ఇబ్బంది పడింది. దీంతో ఆమెను తీసుకెళ్లడానికి వీల్‌చైర్ ను తీసుకొచ్చారు. వరల్డ్ కప్ లో అరుంధతి గాయం జట్టు శిబిరంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సర్జరీ చేయాల్సి వస్తే ఆమె వరల్డ్ కప్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన అరుంధతి ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్‌ను ఔట్ చేసింది.
ప్రస్తుతం రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్ మాతరమే జట్టులో ఉన్నారు. అమన్‌జోత్ కౌర్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే వరల్డ్ కప్ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ టోర్నీ ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్నట్లు ఐసీసీ ఇప్పటికే వెల్లడించింది. సెప్టెంబర్ 30న ఆతిథ్య ఇండియా.. శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
ALSO READ : IND vs WI: సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడితే సరిపోతుందా.. కరుణ్ నాయర్‌కు అగార్కర్ డైరెక్ట్ పంచ్
ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. 2017లో లార్డ్స్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వన్డే వరల్డ్ కప్ భారత మహిళలకు కలగానే మిగిలింది. ఈ సారి టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటంతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
A freak accident in the #INDvENG warm-up clash has forced Arundhati Reddy off the field just ahead of #CWC25.
— ICC (@ICC) September 25, 2025
Read more ➡️ https://t.co/lyVsKwHOca pic.twitter.com/OQ0ktOX40p