బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు.. అది ఎన్నటికీ జరగదని చెప్పిన : కేజ్రీవాల్

బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు.. అది ఎన్నటికీ జరగదని చెప్పిన : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులు లేకుండా చేస్తారంట.  కానీ దానికి నేను ఒప్పుకోలేదు..నేనెప్పుడూ బీజేపీ మోచేతి నీళ్లు తాగను. నేనేం నేరం చేయలేదు..వాళ్లకు తలొంచే ప్రసక్తే లేదు. ఇదే  విషయం వాళ్లకు చెప్పా అని కేజ్రీవాల్  తెలిపారు. కిరారిలోని  రోహిణిలో కొత్త పాఠశాల భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.

 ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 40 శాతం స్కూల్లు, ఆస్పత్రులకు నిధులు కేటయిస్తుంటే.. బీజేపీ  కేంద్ర బడ్జెట్ లో మాత్రం 4 శాతమే నిధులు కేటాయిస్తోందని ఆరోపించారు.  ఇవాళ మంచి పాఠశాలలు నిర్మించడమే మనీష్ సిసోడియా చేసిన తప్పా? మంచి ఆస్పత్రులు, మోహల్లా క్లీనిక్ లు నిర్మించడమే సత్యేంద్ర జైన్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు.  బీజేపీ నేతల ఎన్ని కుట్రలు చేసినా తలవంచబోమని చెప్పారు కేజ్రీవాల్.