అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్ : కేజ్రీవాల్

అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్ : కేజ్రీవాల్

హర్యానాలో అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్

పంచకుల సభలో ఆప్ చీఫ్​ కన్వీనర్ కేజ్రీవాల్ హామీ

చండీగఢ్ : హర్యానాలో కరెంటు కోతలు, బిల్లుల వాతల పాపం అధికారంలోని బీజేపీదేనని ఆమ్  ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్​ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్రంలో తమకు అధికారం కట్టబెడితే నిరంతరాయంగా ఉచిత కరెంట్ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈమేరకు ఆదివారం పంచకులలో ‘బిజిలీ ఆందోళన్’ కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జనం ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలను, బిల్లుల మోతల గురించి అడిగి తెలుసుకుంటారని వివరించారు. అదే సమయంలో ఆప్ కు ఓటేసి, అధికారమిస్తే కరెంటు కష్టాలు తొలగిపోతాయని అర్థమయ్యేలా చెబుతారని అన్నారు. ఢిల్లీలో కూడా కరెంటు కష్టాలపై ఆందోళనలు చేసి, వాటిని తీరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చామని కేజ్రీవాల్​ చెప్పారు.