కేజ్రీవాల్కు ఏడోసారి ఈడీ నోటీసులు

కేజ్రీవాల్కు ఏడోసారి ఈడీ నోటీసులు

లిక్కర్ స్కాం కేసులో  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు  ఈడీ లేటెస్ట్ గా ఏడోసారి నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 26వ తేదీన ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది.  కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే ఆరు సార్లు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  తనకు ఈడీ నోటీసులివ్వడం చట్టవిరుద్ధమన్న కేజ్రీవాల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా  విచారణకు హాజరు కాలేదు. 

కేజ్రీవాల్  విచారణకు హాజరుకావడం లేదని ఈడీ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ  కోర్టులో పిటిషన్ వేసింది. ఫిబ్రవరి 17న విచారణకు హాజరుకావాలని ఆరోసారి(ఫిబ్రవరి 14న) నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణకు హాజరైతే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ఆప్ ఆరోపిస్తుంది. మరి ఏడోసారి నోటీసులపై  ఆప్ ఇంకా స్పందించలేదు..

కేజ్రీవాల్ కు ఏడు సార్లు ఈడీ నోటీసులు

  • కేజ్రీవాల్ కు మొదటి సారి ఈడీ నోటీసులు నవంబర్ 2, 2023 
  • రెండోసారి డిసెంబర్ 21,  2024
  • మూడోసారి జనవరి 3 
  • నాల్గో సారి జనవరి 13 
  •  ఐదవ సారి జనవరి 31 
  • ఆరవ సారి ఫిబ్రవరి 14
  • ఏడో సారి ఫిబ్రవరి 22