ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​కు కోర్టులో ఊరట

ఢిల్లీ సీఎం అర్వింద్​  కేజ్రీవాల్​కు కోర్టులో ఊరట
  • విచారణకు సహకరించలేదంటూ నమోదైన కేసులో బెయిల్

న్యూఢిల్లీ :ఢిల్లీ ఎక్సైజ్​పాలసీ స్కామ్​లో ఆమ్​ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​కు ఊరట లభించింది. ఈ కేసు విచారణకు సహకరించడంలేదంటూ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫైల్​చేసిన రెండు కేసులలో శనివారం ఢిల్లీ రౌస్​అవెన్యూ కోర్టు అర్వింద్​కేజ్రీవాల్​కు బెయిల్​మంజూరు చేసింది. అలాగే, రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌‌ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని అర్వింద్​కేజ్రీవాల్​కు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కాలేదు. దీంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మార్చి 16న హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో శనివారం ఉదయం ఆయన హాజరయ్యారు. ఈ కేసును విచారించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా.. కేజ్రీవాల్​పై ఈడీ మోపిన ఆరోపణలు బెయిల్​పొందడానికి అనుకూలంగానే ఉన్నాయని షరతులతో కూడిన బెయిల్‌‌ మంజూరు చేశారు. అలాగే, ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్‌‌కు అందజేయాలని ఈడీని ఆదేశించారు.