కాంగ్రెస్, ఆప్ మధ్య చిచ్చురేపుతున్న పంజాబ్ డ్రగ్స్ కేసు

కాంగ్రెస్, ఆప్ మధ్య చిచ్చురేపుతున్న పంజాబ్ డ్రగ్స్ కేసు

పంజాబ్‌ డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్‌తో విప‌క్ష ఇండియా కూటమి భాగ‌స్వామ్య ప‌క్షాలు ఆప్‌, కాంగ్రెస్ మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి. ఈ వ్యవ‌హారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌మ పార్టీ ఏ నాయ‌కుడికీ వ్యతిరేకం కాద‌ని, తాము డ్రగ్స్ మ‌హ‌మ్మారికే వ్యతిరేక‌మ‌ని చెప్పారు. ఈ ప్రచారంలో అన్ని పార్టీలూ క‌లిసిరావాల‌ని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

పంజాబ్‌లోని ప‌టియాలాలో సోమ‌వారం (అక్టోబర్ 2న)  నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడారు. డ్రగ్ స్మగ్లింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ బ‌డా వ్యక్తి మూడు రోజుల క్రితం అరెస్ట్ అయ్యార‌ని, ఈ పార్టీల‌న్నీ సీఎం భ‌గ‌వంత్ మాన్‌ను నిందిస్తున్నాయ‌ని చెప్పారు.

తమ పోరాటం ఏ ఒక్క పార్టీపైనో, నాయ‌కుడిపైనో కాద‌ని, డ్రగ్ మ‌హమ్మారిపైనే తాము పోరాడుతున్నామ‌ని కేజ్రీవాల్ చెప్పారు. డ్రగ్ క‌ల్చర్ యువ‌త భ‌విష్యత్‌ను పాడు చేస్తోంద‌ని చెప్పారు. మీ పార్టీలో ఎవ‌రైనా డ్రగ్స్ దందా చేసే వారుంటే వారిని వెంట‌నే మీ పార్టీల నుంచి తొలగించండ‌ని కేజ్రీవాల్ అన్ని రాజ‌కీయ పార్టీల‌కు విజ్ఞప్తి చేశారు.