ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. తెరపైకి ఆప్ అతిషి, సౌరబ్ పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. తెరపైకి ఆప్ అతిషి, సౌరబ్ పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సీఎం కేజ్రీవాల్ విచారణ తర్వాత.. ఊహించని పేర్లను కోర్టులో వెల్లడించింది ఈడీ. కేజ్రీవాల్ విచారణ సమయంలో చెప్పిన కొత్త పేర్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఈడీ.. వాళ్లు ఎవరో కాదు.. ఆప్ పార్టీ కీలక నేతలు అతిషి, సౌరబ్ భరద్వాజ్. వీళ్లద్దరి పేర్లను విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ.. 

లిక్కర్ స్కాంలో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు అయిన విజయ్ నాయర్.. సీఎం కేజ్రీవాల్ సన్నిహితంగా ఉన్నా.. లిక్కర్ పాలసీకి సంబంధించిన వివరాలను ఆప్ మంత్రులు అతిషి, సౌరబ్ భరద్వాజ్ లకు రిపోర్ట్ చేసేవారని.. విచారణలో కేజ్రీవాల్ చెప్పినట్లు కోర్టుకు స్పష్టం చేసింది ఈడీ. అప్పట్లో ఆప్ మంత్రి అతిషి గోవా రాష్ట్రం పార్టీ ఎన్నికల ఇంచార్జీగా ఉన్నారని వెల్లడించింది ఈడీ. అతిషి, సౌరబ్ లకు కూడా లిక్కర్ పాలసీ విషయాలు తెలుసు అని.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ ద్వారా వెల్లడి అయినట్లు ఈడీ వివరణ ఇచ్చింది. 

లిక్కర్ స్కాం విచారణలో.. ఫస్ట్ టైం తమ పేర్లు ఈడీ బయటకు చెబుతున్న సమయంలో అతిషి, సౌరబ్ భరద్వాజ్ కోర్టు హాలులోనే ఉన్నారు. దీనిపై స్పందించటానికి నిరాకరించారు. విజయ్ నాయర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నా.. అతను రిపోర్ట్ చేసేది మాత్రం అతిషి, సౌరబ్ భరద్వాజ్ లకు అని సీఎం కేజ్రీవాల్ చెప్పటం.. ఈ కేసులో మరో ట్విస్ట్. ఈడీ ఇప్పుడు వీళ్లిద్దరినీ విచారిస్తుందా లేదా అనేది చూడాలి.. ఎందుకంటే గోవా ఆప్ ఎన్నికల ఇంచార్జీగా అతిషి వ్యవహరించారు. ఆ సమయంలో విజయ్ నాయర్ తో ఆమె పలుసార్లు మాట్లాడినట్లు ఈడీ చెప్పటం చూస్తుంటే.. మరో ఇద్దరు ఆప్ మంత్రులకు అరెస్ట్ గండం ఉన్నట్లు వార్తలు వస్తు్న్నాయి.