ఎంజీఆర్ గా అరవింద్ స్వామి

ఎంజీఆర్ గా అరవింద్ స్వామి
సినీ నటుడు అరవింద్ స్వామి నటించిన సినిమా తలైవి. ఈ సినిమాలో ఆయన ఎంజీఆర్ పాత్రలో కన్పించనున్నాడు. ఇవాళ(గురువారం) దివంగత నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ వర్దంతి. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమాలో పురట్చి తలైవర్‌ ఎంజీఆర్‌ పాత్రకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. దివంగత నటి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ‘తలైవి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో తలైవిగా బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌, ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి నటించారు. జనవరి 17న ఎంజీఆర్‌ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్‌ స్వామి లుక్‌కి విశేషమైన స్పందన లభించింది. తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.