
యూఎస్ ఎపెన్ 2025 టైటిల్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది అరీనా సబలెంక. అమెరికాలో జరిగిన ఫైనల్లో అమండా అనిసిమోవాను ఓడించి విజేతగా నిలిచింది. ఆర్థర్ ఆషె స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫినాలెలో కేవలం ఒక గంట 34 నిమిషాల్లోనే 6-3, 7-6 (3) తేడాతో యూఎస్ ప్లేయర్ అనిసిమోవాను మట్టి కరిపించింది సబలెంక. ఈ గెలుపుతో సబలెంక ఖాతాలో నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరింది.
రెండు ఆస్ట్రేలియా ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్న సబలెంక.. మరో యూఎస్ గ్రాండ్ స్లామ్ గెలిచింది. పదేండ్ల తర్వాత గ్రాండ్ స్లామ్ ను నిలబెట్టుకున్న ప్లేయర్ గా ఈ బెలారస్ ప్లేయర్ నిలిచింది. 2014లో సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ వరుసగా నిలబెట్టుకుంది. సెరెనా తర్వాత సబలెంక ఈ రికార్డును సొంతం చేసుకుంది.
ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ రెండింటిలో రన్నరప్ గా నిలిచిన సబలెంక.. లోపాలను సరిదిద్దుకుని ఎట్టకేలకు టైటిల్ ను అందుకుంది. వింబుల్డన్ సెమీస్ ఓటమికి లేటెస్ట్ గా న్యూయార్క్ లో జరిగిన ఫైనల్ లో అనిసిమోవాపై ప్రతీకారం తీసుకుంది.
Aryna Sabalenka won this tournament 💅 pic.twitter.com/GXAydNGRpe
— US Open Tennis (@usopen) September 6, 2025