
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తో పాటు పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరెపు దాడులతో విరుచుకుపడింది. మిస్సైళ్లు, డ్రోన్లతో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాయాది పాకిస్థాన్ గజ్జున వణికింది.
భారత్ ఎక్కడ దాడి చేస్తుందోనన్న భయంతో పాక్ తమ యుద్ధ నౌకలను ఇతర నౌకాస్థావరాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది. ఇండియా మిస్సైళ్లకు చిక్కకుండా వార్ షిప్‌లను ఇతర ప్రాంతాలకు తరలించింది. పాక్ యుద్ధ నౌకలకు ప్రధాన స్థావరమైన కరాచీ షిప్ యార్డ్ నుంచి యుద్ధ నౌకలను ఇరాన్ సరిహద్దు జలాల్లోకి మళ్లించింది.
2025, మే 8 నాటి ఉపగ్రహ చిత్రాల్లో కరాచీ నౌకాస్థావరంలో పాక్ యుద్ధ విమానాలు జాడ కనిపించకపోవడంతో ఈ విషయం స్పష్టమైంది. మరికొన్ని యుద్ధ నౌకలను పాక్ తెలివిగా కమర్షియల్ టెర్మినల్స్‌కు తప్పించి కాపాడుకుంది. 2025, మే 10న పాక్ తమ 7 వార్ షిప్ లను గద్వార్ కమర్షియల్ టర్మినల్‌కు తరలించింది. దీంతో ఆ రోజు గద్వార్ కమర్షియల్ పోర్ట్ పాక్ యుద్ధ నౌకలతో నిండిపోయింది.
ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ తమ యుద్ధ నౌకలను వాణిజ్య ఓడరేవు ప్రాంతంలో ఉంచడం భారత క్షిపణి దాడుల నుండి తప్పించుకోవడంలో భాగమేంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. భారత్ దెబ్బకు పాక్ నేవీ తోకముడించిందంటున్నారు నెటిజన్లు. కాగా, 2025, ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించిన విషయం తెలిసిందే.
పాక్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 26 మంది అమాయక ప్రజలు బలయ్యారు. ఉగ్రవాదులు మతం అడిగి మరీ ఒక వర్గానికి చెందిన మారిని మాత్రమే టార్గెట్ చేసుకుని చంపేశారు. ఈ ఉగ్రదాడి యావత్ దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించింది. ఈ క్రమంలో పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ భారత్ ఆపరేషన్ సిందూర్ లాంచ్ చేసి.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించింది.