అంబులెన్స్​ రాకపోవడంతో... బైక్​పై కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

అంబులెన్స్​ రాకపోవడంతో... బైక్​పై కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందా అనే అనుమానం వచ్చే మరో ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ఈ మధ్యే ఓ రాష్ట్రంలో మృతి చెందిన తన కుమారుడిని బస్సుల్లో తీసుకెళ్లిన తండ్రి ఘటన మరువకముందే మరోటి జరగడం బాధాకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​లోని కోట గ్రామానికి చెందిన లక్ష్మణ్​ సింగ్​, తన కుమార్తె మాధురి కి అనారోగ్యంగాఉండటంతో షాడోల్​ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్​ చేశాడు. అక్కడ చికిత్స పొందుతూ మాధురి మరణించింది. మృతదేహాన్ని తరలించడానికి ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్​ని అడగ్గా వాళ్ల ఊరు 70 కి.మీ. ల దూరంలో ఉండటంతో, 15 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వాహనాలు అందుబాటులో లేవని చెప్పారు. 

మృతదేహం తరలింపునకు ప్రైవేటు అంబులెన్స్​ఎక్కువగా డబ్బులు అడగటంతో తండ్రి దిక్కు తోచని స్థితిలో బంధువు సాయంతో తన బైక్​ పై మృతదేహం తీసుకెళ్లారు. తండ్రి దయనీయ పరిస్థితిని పట్టించుకోకుండా అధికారుల చూపించిన అలసత్వం, మానవత్వం లేని మనస్సును పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న షాడోల్​ కలెక్టర్​ వందనా అంబులెన్స్​ని ఏర్పాటు చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపజేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.  అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు.