
పహల్గాం ఉగ్రదాడిని క్వాడ్ గ్రూప్ దేశాలు ఖండించాయి. క్వాడ్ దేశాలు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రుల సమావేశంలో పహల్గాం దాడి బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని సంయుక్త ప్రకటనలో కోరారు.
ఉగ్రవాద చర్యలు, హింసాత్మక తీవ్రవాదం, సరిహద్దు ఉగ్రవాదం.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిస్సందేహంగా ఖండిస్తున్నట్లు క్వాడ్ దేశాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాద వ్యతిరేకంగా భారత్ కు మద్దతు ప్రకటించాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్ట్ ప్లేస్ బైసరన్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. దాడి చేసిన వారికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.
ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై నేలమట్టం చేసింది.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో జైశంకర్ భేటీ
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, భద్రత, టెక్నాలజీ, కనెక్టివిటీ, పవర్ వంటి రంగాలపై ,భారత్, అమెరికా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రాంతీయ ,ప్రపంచ సమస్యలపై కూడా వారు అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో ఆహ్వానం మేరకు జైశంకర్ ప్రస్తుతం జూన్ 30 నుండి జూలై 2 వరకు అమెరికాకు అధికారిక పర్యటనలో ఉన్నారు.
అమెరికాతో రక్షణ భాగస్వామ్యంపై చర్చలు
వాషింగ్టన్ డిసిలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌ను కూడా జైశంకర్ కలిశారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణపరమైన సంబంధాలపై చర్చించారు.భారత్ అమెరికారక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు దృష్టి సారించారు.