
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సమర్థవంతంగా ప్రయోగించగల గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ INS తమల్ భారత నావికాదళంలో చేరింది. మంగళవారం(జూన్1) INS తమల్ ను నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. విదేశీ సహకారంతో తయారు చేసిన చివరి యుద్ధనౌక ఇది.ఐఎన్ఎస్ తమల్ సముద్రంలో ఓ బలీయమైన కదిలే కోటలాంటిది. గాలి, ఉపరితలం, నీటి అడుగున ,విద్యుదయస్కాంతం నాలుగు కోణాలలో లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం రూపొందిచారు.
భారత నావికాదళంలోకి యుద్ధనౌక INS తమల్(INS Tamal) ను జూలై 1, 2025న రష్యాలోని కలినిన్ గ్రాడ్‌లోని యాంటార్ షిప్‌యార్డ్‌లో చేర్చారు. ఈ యుద్ధనౌక భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేసిన చివరి యుద్ధనౌక కావడం విశేషం.
INS తమల్ అనేది ప్రాజెక్ట్ 1135.6 శ్రేణిలో 8వ స్టెల్త్ ఫ్రిగేట్ ,తుషిల్ క్లాస్ నౌకలలో రెండోది.దీనిని లేటెస్ట్ టెక్నాలజీతో నిర్మించారు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, గాలి నుంచి గాలికి ప్రయోగించే క్షిపణులు, అధునాతన గన్ సిస్టమ్స్, టార్పెడోలు,అండర్ వాటర్ రాకెట్ లాంచర్ల ప్రయోగానికి స్పెషల్ యుద్దనౌక.
ఈ నౌకకు ఇంద్రుడు ఉపయోగించిన పౌరాణిక కత్తికి ప్రతీకగా తమల్ అని పేరు పెట్టారు. ఇది భారత నావికాదళం పశ్చిమ నౌకాదళం ది స్వార్డ్ ఆర్మ్ లో భాగంగా ఉంటుంది.
ముఖ్య అంశాలు:
కమిషనింగ్: జూలై 1, 2025
నిర్మాణ ప్రదేశం: యాంటార్ షిప్‌యార్డ్, కలినిన్‌గ్రాడ్, రష్యా
తరగతి: తుషిల్ క్లాస్ (ప్రాజెక్ట్ 1135.6) స్టెల్త్ ఫ్రిగేట్
ప్రత్యేకత: విదేశాల నుంచిభారత్ కొనుగోలు చేసిన చివరి యుద్ధనౌక.
ఆయుధాలు: బ్రహ్మోస్ క్షిపణులు, స్టెల్త్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, టార్పెడోలు మొదలైనవి.
కీ రోల్: గాలి, ఉపరితలం, నీటి అడుగున,విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌తో సహా అన్ని రంగాలలో నౌకాదళ యుద్ధ కార్యకలాపాల కోసం రూపొందించారు.
INS తమల్ రాకతో భారత నావికాదళం సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం సముద్ర శక్తిని బలోపేతం అవుతుంది.