
బెంగళూరులోని జయదేవ్ఆస్పత్రిలో గుండె సంబంధిత రోగులతో కిక్కిరిపోయింది. బుధవారం(జూన్2) గుండె చెకప్ కోసం సిటీతో పాటు ముఖ్యంగా హసన్‌జిల్లా వాసులు క్యూకట్టారు. గతంకంటే అధిక సంఖ్యలో రావడంతో చర్చనీయాంశంగా మారింది.. దీనంతటికి కారణం..హసన్ జిల్లాలో కేవలం 40 రోజుల్లో 21 మంది గుండెపోటుతో మృతిచెందడం. మృతులంగా చిన్నవయసువారు కావడమే.. అసలెందుకు హసన్ జిల్లాలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి.. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని హసన్ జిల్లాలో గుండెపోటు మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. సోమవారం జరిగిన మూడు మరణాలతో కేవలం 40 రోజుల్లోనే మొత్తం మరణాల సంఖ్య 21కి చేరుకుంది. ముఖ్యంగా మరణించిన వారిలో అధిక సంఖ్యలో యువకులు ఉండటం ఆందోళనకరమైన విషయం.
సోమవారం బేలూరు పట్టణంలోని జేపీనగర్‌కు చెందిన లేపాక్షి (50) అలసటతో బాధపడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. టీ తాగుతుండగా గుండెపోటుకు గురై హోలెనరసిపురంలో ముత్తయ్య (58) అనే ఇంగ్లీష్ ప్రొఫెసర్చనిపోయాడు. చన్న రాయపట్టణంలో డీ గ్రూప్ ఉద్యోగి కుమార్ (57) ఛాతినొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మరణాలతో హసన్ జిల్లాలో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది..ఆ జిల్లా వాసుల్లో ఆందోళన పెరిగింది.
9-25యేళ్లలోపు ఐదుగురు..25-45 యేళ్ల లోపు వారు ఎనిమిది మంది..
హసన్ జిల్లాలో మరణించిన 21మందిలో ఐదుగురు 19–25 యేళ్లలోపు, 25–-45 యేళ్ల లోపు వారు ఎనిమిది మంది ఉన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 45 యేళ్ల కంటే తక్కువ వయస్సు గలవారు కావడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి,ఆందోళనకు గురిచేసింది. గత రెండేళ్లలో హసన్‌లో నమోదైన 507 గుండెపోటు కేసుల్లో 190 ప్రాణాంతకమైన గుండెపోటు కేసులని జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
జయదేవ్ హాస్పిటల్ కిక్కిరిసిపోయింది..
బెంగళూరులోని శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ బుధవారం హృద్రోగులతో కిక్కిరిసిపోయింది. పెరుగుతున్ గుండెపోటు కేసులతో ఆందోళన క్రమంలో ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగం నిండిపోయింది. గతంకంటే 8శాతం రోగుల సందర్శన శాతం పెరిగింది. ఇది పెరుగుతున్న ప్రజా ఆందోళన, ఈ ప్రాంతంలో గుండె సంరక్షణకోసం అత్యవసర పరిస్థితిని స్పష్టం చేస్తుంది.
ఉన్నత స్థాయి దర్యాప్తు ..
ఈ పెరుగుతున్న సంక్షోభానికి ప్రతిస్పందనగా జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆరోగ్య శాఖ. 18 గుండెపోటు మరణాలపై డిపార్ట్‌మెంట్ ప్రాథమికంగా కనుగొన్న దాని ప్రకారం మరణించిన వారిలో తొమ్మిది మంది 55 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్యాలతో ఉన్నారని తేలింది.
ఐదుగురు 20 ఏళ్లలోపు వారని (వీరిలో నలుగురు బెంగళూరులో మరణించారు కానీ హసన్‌కు చెందినవారు) తేలింది. ఈ మరణాలకు టైప్-1 డయాబెటిస్ ,దీర్ఘకాలిక వ్యాధులు వంటి అంశాలు ఉండగా..మొదట నివేదించబడిన 18 మరణాలలో పదహారు మరణాలు ఇంట్లోనే సంభవించాయి. వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది.
చిన్న వయసువారిలో గుండెపోటు మరణాలకు కోవిడ్ 19 కారణమని వార్తలు వస్తున్న క్రమంలో గుండెపోటుకు, కోవిడ్ కు మధ్య సంబంధాన్ని కనిపెట్టేందుకు జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ హసన్ వాసుల వైద్యపరమైన రిపోర్టులను సమీక్షించి సమగ్ర ఫలితాలను 10 రోజుల్లోపు సమర్పించనుంది.
కోవిడ్-19, గుండె సంబంధిత సంఘటనల మధ్య సంభావ్య సంబంధాలను పరిశోధించడానికి ఫిబ్రవరిలో మొదట ఏర్పాటు చేయబడిన ఈ కమిటీ, ఇప్పుడు హసన్ వైద్య నివేదికలన్నింటినీ సమీక్షించి, దాని సమగ్ర ఫలితాలను 10 రోజుల్లోపు సమర్పించాలని ప్రత్యేకంగా ఆదేశించబడింది.