ట్రిపుల్ తలాఖ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: అసద్

ట్రిపుల్ తలాఖ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: అసద్

ట్రిపుల్ తలాఖ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ రోజు లోక్ సభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్  ట్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే.. బిల్లుపై అసదుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వేధింపుల విషయంలో మిగతా మతాల వారికి ఏడాది జైలు శిక్ష, ముస్లిం మతానికి చెందిన పురుషులకు 3 సంవత్సరాల శిక్షను వేయడం సమన్యాయ ఉల్లంఘన అని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ ఇచ్చారని భర్తకు శిక్ష విధిస్తే.. ఆ బాధిత భార్యకు ఆర్ధికంగా ప్రభుత్వం అండగా ఉంటుందా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళలపై చూపిస్తున్న ఆదరణ…. శబరిమల అంశంలో హిందు మహిళల పట్ల ఎందుకు చూపించడం లేదని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాఖ్ ను క్రిమినల్ చర్యగా చూడడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.