
హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలనలో దరఖాస్తులను ఉర్దూలోనూ తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారిని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈ మేరకు ప్రజా పాలన అప్లికేషన్లు ఉర్దూ భాషలోనూ ఉండాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఐదు గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ను తీసుకోవాలని ప్రభత్వం నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగానే అప్లికేషన్లను తయారు చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి ఆ వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. తెలుగు రాని ఇతర ప్రజలు కూడా లబ్ధి పొందడానికి వీలుగా ఈ మార్పు చేయాలని కోరారు.