యూసీసీని వ్యతిరేకిస్తూ.. సీఎం కేసీఆర్​ను కలిసిన అసదుద్దీన్​

యూసీసీని వ్యతిరేకిస్తూ.. సీఎం కేసీఆర్​ను కలిసిన అసదుద్దీన్​

యూనిఫాం సివిల్ కోడ్​ బిల్లు అమలు చేస్తే అనేక రంగాల ప్రజలు అన్యాయానికి గురవుతారని ఎంపీ అసదుద్దీన్​ఓవైసీ అన్నారు. యూసీసీ బిల్లు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు  చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ ను జులై 10 న ప్రగతి భవన్ లో ముస్లిం ప్రతినిధులతో వెళ్లి కలిశారు. 

కేంద్ర ప్రభుత్వం యూసీసీ బిల్లు తెస్తే వ్యతిరేకించాలని సీఎంను కోరినట్లు అసద్ వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఈ బిల్లుతో గిరిజనులు తదితర వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతారని ఆయన అన్నారు.  ఇదే అంశంపై ఏపీ సీఎం వైఎస్​ జగన్​ ని కోరుతున్నామన్నారు. ప్రధాని మోదీ లౌకికవాదాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.  సమాజంలోని ముఖ్యులతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలిపారు.