బోధన్లో ఎంఐఎం జెండాను ఎగరవేయాలి : అసదుద్దీన్ ఓవైసీ

బోధన్లో ఎంఐఎం జెండాను ఎగరవేయాలి : అసదుద్దీన్ ఓవైసీ

బోధన్, వెలుగు : బోధన్ లో ఎంఐఎం పార్టీ జెండాను ఎగరవేయాలని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ పార్టీ నేతలకు సూచించారు. బోధన్​ పట్టణ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎన్నికైన మీర్ ఇలియాస్​ అలీని, కమిటీ ప్రతినిధులను అభినందించి సన్మానించారు.  అనంతరం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా పని చేయాలని సూచించారు. బోధన్ మున్సిపాలిటీలో గతంలో సాధించిన కౌన్సిలర్ల సంఖ్యకు రెట్టింపు చేయాలన్నారు. 

బోధన్ మున్సిపాలిటీ పై ఎంఐఎం జెండా ఎగరవేసే విధంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసీ తో పాటు మలక్​పేట్​ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బళ్లాల, ఎంఐఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు షకీల్ హైమద్ ఫాజల్, నిజామాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మజీద్ ఖాన్, బోధన్ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాజ్ అలీ, బోధన్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్  ( ఖదీర్) పాల్గొన్నారు.