బీహార్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలపై ఓవైసీ ఫైర్

బీహార్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలపై ఓవైసీ ఫైర్

శ్రీ రామనవమి సందర్బంగా బీహార్, పశ్చమబెంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్, బీహార్ ప్రభుత్వాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా నితీష్ కుమార్, మమతా బెనర్జీ ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీబిహార్, బెంగాల్లో జరిగిన కాల్పులను అరికట్టడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.  ఏ రాష్ట్రంలో హింస జరిగితే...  దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. 

బీహార్లో సీఎం నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌లు ముస్లింలలో భయాన్ని పెంచుతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.  నలంద సున్నితమైన జిల్లా అని బీహార్ సిఎం నితీష్ కుమార్‌కు తెలుసని...అక్కడ జరిగిన సంఘటపై ఆయనకు పశ్చాత్తాపం లేదన్నారు. బీహార్‌ షరీఫ్‌లోని మదర్సా అజీజియాను తగులబెట్టారని..ముస్లింల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారన్నారు. ఇది పక్కా ప్రణాళికతోనే జరిగిందని ఆరోపించారు.  బిహార్లో ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. బీహార్ కు ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ హింసాత్మకఘటనలను ఎందుకు ఆపలేకపోయారన్నారు. 

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయినా... బీహార్ ప్రభుత్వం అయినా..హింసాత్మక ఘటనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. కర్ణాటకలో ఇద్రీస్ పాషాపై మూక హత్యలు జరిగినా. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన హింసాకాండపై సీఎం మమతా బెనర్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  మమత బెనర్జీ నిద్రపోతుందా అని ప్రశ్నించారు.