అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణంపై లోక్ సభలో రగడ

అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణంపై లోక్ సభలో రగడ

హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం తర్వాత.. ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళం సృష్టించాయి. ఎంపీగా ప్రమాణం పూర్తయిన తర్వాత జై భీం.. జై మీం.. జై తెలంగాణ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యానించారు. 

సభలో జై పాలస్తీనా అంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సభలో ప్రొటెం స్పీకర్ ను ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ భారత పార్లమెంట్ ను అగౌర పరుస్తున్నారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సభ్యులు. 

సభలో గందరగోళంపై ప్రొటెం స్పీకర్ స్పందించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగిస్తామని సభకు హామీ ఇచ్చారు. దీంతో సభలో గొడవ సద్దుమణిగింది.