గల్ఫ్ మార్కెట్లోకి ఏఎస్‌‌‌‌బీఎల్.. పలు నగరాల్లో ఎన్నారై రియల్టీ మీట్

గల్ఫ్ మార్కెట్లోకి ఏఎస్‌‌‌‌బీఎల్.. పలు నగరాల్లో ఎన్నారై రియల్టీ మీట్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆక్సెలరేటింగ్  స్పీడ్​ బిల్డింగ్​ లైఫ్ (ఏఎస్​బీఎల్​) మిడిల్ ఈస్ట్‌‌‌‌లో ఎన్నారై రియల్​ఎస్టేట్​ మీట్‌‌‌‌ను విజయవంతంగా నిర్వహించింది. మస్కట్, దోహా, అబుదాబి, దుబాయ్​లో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఏఎస్‌‌‌‌బీఎల్ గల్ఫ్ మార్కెట్‌‌‌‌లోకి ప్రవేశించింది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్, ధరల ట్రెండ్‌‌‌‌లు, పెట్టుబడి సామర్థ్యం గురించి కూడా ఎన్నారైలకు స్పష్టమైన అవగాహన కల్పించింది. ‘‘రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మిడిల్ఈస్ట్ ముఖ్యమైన ప్రాంతం. మౌలిక సదుపాయాలు, బలమైన నియంత్రణ వ్యవస్థ కారణంగా వృద్ధి అవకాశాలను కోరుకునే ఎన్నారైలకు ఇది అనువైనది”అని తెలిపింది.