ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం చెల్లించాలి  :  ఆర్.నీలాదేవి

ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం చెల్లించాలి  :  ఆర్.నీలాదేవి

ములుగు, వెలుగు : ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.18వేల ఫిక్స్ డ్ వేతనం అందించాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆశావర్కర్లు ర్యాలీ నిర్వహించి, మంత్రి సీతక్క క్యాంపు ఆఫీస్​ను ముట్టడించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నీలాదేవి మాట్లాడుతూ ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం ప్రకటించాలన్నారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు.