ప్రతినెలా కనీస వేతనం చెల్లింపుతో పాటు మరో 13 డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆశా వర్కర్లు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమ డిమాండ్ లను పరిష్కరించాలని డ DMHO స్వరాజ్యలక్ష్మికి ఇవాళ వినతి పత్రం సమర్పించారు. "చెట్టు మీద కొంగ కేసీఆర్ దొంగ, వద్దురా వద్దురా కేసీఆర్ పాలన, ప్రభుత్వ వైఖరి నశించాలి" అంటూ నినాదాలు చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. ఈ ధర్నాలో వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
