అంబేద్కర్ ​కాలేజీలో ఘనంగా బోనాలు

అంబేద్కర్ ​కాలేజీలో ఘనంగా బోనాలు

బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ ఇనిస్టిట్యూషన్స్ లో శనివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టూడెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరస్పాండెంట్, డైరెక్టర్ సరోజా వివేక్ హాజరై క్యాంపస్​లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి బోనం సమర్పించారు. పోతరాజుల వేషధారణలో స్టూడెంట్లు ఆట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. - వెలుగు, ముషీరాబాద్