ఆశాలపల్లి సర్పంచ్ మల్లమ్మనే!..పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్

ఆశాలపల్లి సర్పంచ్ మల్లమ్మనే!..పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్
  • ఒక్క ఓటరే ఉండగా ఆమె వైపే పార్టీల చూపు

 పర్వతగిరి (సంగెం), వెలుగు: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఒక్క మహిళా ఓటరుపైనే అన్ని పార్టీల నేతలు దృష్టి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ ఊళ్లో ఎస్సీ మహిళ ఓటరు కొంగర మల్లమ్మ మాత్రమే  ఉంది. దీంతో ఆమెనే సర్పంచ్ గా కన్ఫర్మ్ అయింది. 

పంచాయతీలో సుమారు 1,600 పైగా ఓటర్లు ఉన్నారని, కానీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మల్లమ్మ ఒక్కరే ఉన్నారని ఎంపీడీవో రవీందర్ తెలిపారు. ఆమె కుటుంబం కొన్నాళ్ల కింద వర్ధన్నపేట మండలం నుంచి వచ్చి నివసిస్తోంది. ఆమె ఇద్దరు కూతుళ్లకు పెండ్లిళ్లు అయ్యాయి. మల్లమ్మ భర్త కొద్ది రోజుల కింద చనిపోయాడు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు మల్లమ్మ వైపే చూస్తున్నారు. తమ పార్టీలో అంటే తమ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.