సర్కారు నుంచి నయాపైసా అందలేదు

సర్కారు నుంచి నయాపైసా అందలేదు

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సర్పంచ్

మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: మూడేండ్లుగా తమ గ్రామానికి నిధులు కేటాయించడం లేదని, అప్పులు చేసి సొంతంగా పనులు చేసుకోవాల్సి వస్తోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ వెల్శెట్టి స్వర్ణలత సురేశ్​ఆరోపించారు. శనివారం గ్రామంలో సొంత పనులతో రోడ్డు పనులు చేయించి, మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రూ.15లక్షలు ఖర్చు చేసి, గ్రామాన్ని అభివృద్ధి చేశానని, సర్కారు నుంచి నయాపైసా అందలేదన్నారు. అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నామని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలకు రూ.10లక్షలు ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఇకనైనా సర్కారు స్పందించి, న్యాయం చేయాలని కోరారు.