Dethadi Movie: హైదరాబాద్ వీధుల్లో దేత్తడి.. ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఆశిష్ కొత్త మూవీ

Dethadi Movie: హైదరాబాద్ వీధుల్లో దేత్తడి.. ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఆశిష్ కొత్త మూవీ

రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న ఆశిష్.. కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో ఆదిత్యరావు గంగాసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్‌‌‌‌గా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించగా, గురువారం ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌‌‌‌తోపాటు ఆశిష్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘దేత్తడి’ అనే టైటిల్‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ఆశిష్ స్టైలిష్ లుక్‌‌‌‌లో డప్పు కొడుతూ ఎనర్జిటిక్‌‌‌‌గా కనిపిస్తున్నాడు. బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కలర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా కనిపిస్తూ చుట్టూ జనం అంతా సందడిగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఓల్డ్ సిటీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని, హైదరాబాద్ వీధుల్లో చోటు చేసుకునే కల్చర్‌‌‌‌‌‌‌‌తో నిండిన ఎమోషన్స్ ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్ అందించనుందని మేకర్స్ చెప్పారు. ఈ సినిమాలో మాస్ మేకోవర్‌‌‌‌లో కనిపించనున్న ఆశిష్, హైదరాబాదీ స్లాంగ్‌‌‌‌లో డైలాగులు చెప్పడం సినిమాకు మరో హైలైట్ కానుందని అన్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం కూడా మరో ప్రధాన బలంగా నిలవనుందని చెప్పారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌‌‌‌పైకి వెళ్లనుంది.