హైదరాబాద్, వెలుగు: ఆర్అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ భేటీ అయ్యారు. శుక్రవారం సెక్రటేరియెట్లో ఇద్దరు మంత్రుల మధ్య సినీ పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పాలసీ అంశాల పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్ గా డెవలప్మెంట్చేస్తున్నామని అన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, మహారాష్ట్రలో కూడా ఇట్లాంటివి అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చినట్టు మంత్రి ఆశిష్ శెలార్ వివరించారు. మహారాష్ట్ర ఫిల్మ్ సిటీని విజిట్ చేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఆశిష్శెలార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం జూపల్లి కృష్ణారావుతోను భేటీ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై చర్చించారు.
