
నటుడు ఆశిష్ విద్యార్థి(Ashish Vidyarthi) ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గువాహటికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవా (Rupali Barua)ను ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అరవై ఏళ్ళ వయసున్న ఆశిష్ విద్యార్థి తన 33ఏళ్ళ వయసున్న రుపాలీ బరూవాను పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విమర్శలు కూడా తలెత్తాయి. అయితే తాను ఏ పరిస్థితిలో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది వివరిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆశిష్ విద్యార్థి. దాంతో ఆ విమర్శలకు చెక్ పడింది.
ఇక తాజాగా ఈ జంట హనీమూన్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు . దీనికి సంబందించిన ఫోటోను ఆశిష్ విద్యార్థి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. అవికాస్తా క్షణాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి