మలేషియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్స్‌‌‌‌ ఫైనల్ కు అష్మిత

 మలేషియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్స్‌‌‌‌ ఫైనల్ కు అష్మిత

కౌలాలంపూర్‌‌‌‌: ఇండియా షట్లర్‌‌‌‌ అష్మితా చాలిహా.. మలేషియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అష్మిత 21–-13, 21–-16 తేడాతో  గో జిన్ వెయ్‌‌‌‌ (మలేసియా)పై గెలిచింది. 

రెండు గేమ్‌‌‌‌ల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ కేవలం 30 నిమిషాల్లోనే మ్యాచ్‌‌‌‌ను ముగించింది. బలమైన స్మాష్‌‌‌‌లు, ర్యాలీలతో స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో మాళవిక బన్సోద్‌‌‌‌ 21–16, 8–21, 15–21తో లైన్‌‌‌‌ హోజ్‌‌‌‌మార్క్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌) చేతిలో, దేవిక సిహాగ్‌‌‌‌ 16–21, 13–21తో చెన్‌‌‌‌ యుఫీ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో సాత్విక్‌‌‌‌ కనకపురం–రాధిక శర్మ 12–21, 25–27తో ప్రెస్లీ స్మిత్‌‌‌‌–జెన్నీ గై (అమెరికా) చేతిలో పోరాడి ఓడారు. మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో హరిహరన్‌‌‌‌–ఎం.ఆర్‌‌‌‌. అర్జున్‌‌‌‌ 14–21, 15–21తో హు కే యువాన్‌‌‌‌–లిన్‌‌‌‌ జియాంగ్‌‌‌‌ యి (చైనా) చేతిలో కంగుతిన్నారు.