మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్స్‏లోనే అష్మితా ఓటమి

 మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో క్వార్టర్స్‏లోనే అష్మితా ఓటమి

కౌలాలంపూర్‌‌‌‌‌‌‌‌: ఇండియా ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అష్మితా చాలిహా మలేసియా మాస్టర్స్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్‌‌‌‌‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో అష్మిత 23–21, 18–21, 11–21తో లైన్‌‌‌‌‌‌‌‌ హోజ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ కెర్స్‌‌‌‌‌‌‌‌ఫెల్ట్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడింది. గంట పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంది. దూకుడుగా ఆడి బ్రేక్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌కు 11–6తో నిలిచింది. ఆ తర్వాత హోజ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ పుంజుకుని 13–12, 19–18 లీడ్‌‌‌‌‌‌‌‌ సాధించినా అష్మిత పట్టువదలకుండా పోరాడి నెగ్గింది.

రెండో గేమ్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలోనూ వరుస పాయింట్లతో హోరెత్తించిన అష్మిత 10–5తో ముందంజ వేసింది. వెంటనే కోలుకున్న హోజ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ 13–13, 15–15తో స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి అష్మిత క్రమంగా వెనకబడి గేమ్‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకుంది. డిసైడర్‌‌‌‌‌‌‌‌లో అష్మితకు కనీసం పుంజుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలేదు. 8–4 ఆధిక్యంతో హోజ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. ఈజీగా గేమ్‌‌‌‌‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది.