సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం దేవకి నందన వాసుదేవ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తుండగా లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ సినీ నిర్మాత సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక చిత్రంలో హీరోయిన్ గా మానస వారణాసి నటించగా దేవదత్తా నాగే కంసరాజ పాత్రలో నటించాడు.
ALSO READ | హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ: సరికొత్తగా నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో..
ఇటీవలే ఈ చిత్ర విడుదలపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ షేర్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 14న దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయనికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. కాగా ఆమధ్య ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
With the blessings of the Lord Krishna ✨🙏
— Ashok Galla (@AshokGalla_) October 6, 2024
Coming to the big screens with #DevakiNandanaVasudeva on NOVEMBER 14TH, 2024 ❤️
Hoping to have all your love & support for this special one 🤗🫶#DNVonNov14@varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @DevdattaGNage @getupsrinu3… pic.twitter.com/wdHCI0sGcR