
సీఎల్పీ మీటింగ్‌లో షేక్ హ్యాండ్, చిరునవ్వులు.. పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు
రాష్ట్ర ప్రజల కోసం ఒక్కటయ్యాం: అశోక్ గెహ్లాట్ ట్వీట్
ఇవ్వాల్టి నుంచి అసెంబ్లీ
కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే యోచనలో కాంగ్రెస్
జైపూర్: రాజస్థాన్ రాజకీయం ఎట్టకేలకు సుఖాంతమైంది. ఇంటిపోరుతో రచ్చకెక్కిన కాంగ్రెస్ పార్టీలో క్రైసిస్ కొలిక్కి వచ్చింది. రెండు వర్గాలుగా చీలిపోయిన టాప్ నేతలు కలిసిపోయారు. తూర్పు, పడమరలా విడిపోయిన సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మొత్తానికి చేతులు కలిపారు. నవ్వులు చిందించారు. దీంతో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొలిటికల్ డ్రామా ముగిసిపోయింది. మరోవైపు శుక్రవారం నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. దీంతో ఇవ్వాళే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. బీజేపీ ప్లాన్‌కు కౌంటర్‌గా కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టే యోచనలో సీఎం గెహ్లాట్ ఉన్నారు.
ఫర్ గివ్.. ఫర్ గెట్..
శుక్రవారం నుంచి అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించనున్న నేపథ్యంలో సభలో అనుసరించనున్న వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసింది. సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో అశోక్ గెహ్లాట్ ను సచిన్ పైలట్ కలిశారు. చిరునవ్వులు చిందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చున్నారు. అంతా సజావుగా సాగేందుకు.. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా మీటింగ్ కు హాజరయ్యారు. వారిని క్షమించి, అంతా మరిచిపోయి కలిసి ముందుకు సాగుతామని గురువారం ఉదయాన్నే గెహ్లాట్ ట్వీట్ చేశారు. ‘‘నెల రోజుల వ్యవధిలో పార్టీలో అంతర్గతంగా అసమ్మతి చెలరేగినా.. మనం రాష్ట్రం కోసం, దేశం కోసం, రాజస్థాన్ ప్రజల కోసం.. ‘అంతా మరచిపోవాలి.. క్షమించాలి’ అన్నస్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక సచిన్ పైలట్ క్యాంపుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ లపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఎత్తివేసింది.
ఓటింగ్ జరిగితే బీఎస్పీ ఎమ్మెల్యేలకు చాన్స్
బీఎస్పీనుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. అవిశ్వాస పరీక్ష జరిగితే.. ఓటింగ్ లో పాల్గొనేందుకు వారికి అవకాశం దొరికిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. బీజేపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి విలీనమవ్వడాన్ని తాత్కాలికంగా ఫ్రీజ్ చేయాలన్న వినతిని తిరస్కరించింది. తాము ఇందులో జోక్యం చేసుకోబోమని, దీనిపై ఇప్పటికే విచారణ జరపుతున్న రాజస్థాన్ హైకోర్టు జడ్జీ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ఒకవేళ ట్రస్ట్ ఓట్ జరిగితే బీఎస్పీ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనే చాన్స్ వచ్చినట్లయింది.
అవిశ్వాసం పెట్టనున్న బీజేపీ
కాంగ్రెస్ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీడర్ ఆఫ్ అపోజిషన్ గులాబ్ చంద్ కటారియా చెప్పారు. శుక్రవారమే నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడతామని తెలిపారు. అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 200. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 107 మంది కాగా, బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీ మార్క్ ను చేరుకోవాలంటే ఏ పార్కైనాటీ 101 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్ బలం 125కు చేరింది.
For More News..