రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషిని సిఫార్సు చేసిన అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషిని సిఫార్సు చేసిన అశోక్ గెహ్లాట్

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం పదవికి స్పీకర్ సీపీ జోషి పేరును అశోక్ గెహ్లాట్ సిఫార్సు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగినా సీఎం పదవి వదిలేదిలేదని ఇంతకాలంచెప్తూ వచ్చిన గెహ్లాట్.. ఇప్పడు రాజస్థాన్ సీఎం సీటులో స్పీకర్​ను కూర్చోబెడతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బడ్జెట్ సమావేశాల వరకు అంటే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారని తెలిపాయి.

పార్టీలో ఒకరికి ఒకే పదవి సూత్రం వర్తిస్తుందని బుధవారం సోనియా స్పష్టంచేసిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించాయి. కాగా, అధ్యక్ష పదవి కోసం పోటీపడేటోళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గెహ్లాట్‌‌‌‌, థరూర్‌‌‌‌, కమల్‌‌‌‌నాథ్‌‌‌‌ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మనీశ్‌‌‌‌ తివారీ, ఖర్గే, సిద్ధరామయ్య కూడా పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.