అషు రెడ్డి కేసులో ఊహించని మలుపు.. వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు

అషు రెడ్డి కేసులో ఊహించని మలుపు.. వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలు

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, ఎన్నారై ధర్మేంద్ర కేసు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి , కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిందనే ఆరోపణలతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కింది. లేటెస్ట్ గా ఈకేసు విషయంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేయడం మరింత చర్చనీయాంశమైంది. 

అసలు వివాదం ఏమిటి?

లండన్‌కు చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారైని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అషురెడ్డి, అతని నుంచి సుమారు రూ. 9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అషురెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే అషురెడ్డి, ఆమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి తామే తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్‌లు ఈ కేసుకు మరింత బలం చేకూర్చాయి.

ఆడియో క్లిప్పింగ్‌లతో చిక్కులు

వైరల్ అవుతున్న ఆడియోలో.. మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తాను, మిగిలిన డబ్బులు సెటిల్ అయ్యాక ఇస్తాను అని అషురెడ్డి ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు, అప్పులు చేసి మరీ ఆమెకు డబ్బులిచ్చాను, చివరకు మోసపోయాను అని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో కూడా సంచలనం రేపుతోంది.

హైకోర్టుకు అషురెడ్డి 

అయితే ఈ తప్పుడు ప్రచారం తన పరువుకు భంగం కలిగిస్తోందని అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆమె వ్యక్తిత్వానికి భంగం కలిగించే వార్తలను ప్రసారం చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అషు రెడ్డి. గత కొన్ని రోజులుగా నాపై నిరాధారమైన కథనాలు వస్తున్నాయి. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, నా ప్రైవసీని గౌరవించాలని మీడియాను, నెటిజన్లను కోరుతున్నాను. కోర్టు ఆదేశాల ప్రకారం అభ్యంతరకర పోస్టులను తొలగించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ కేసు సోమవారం నాటి తదుపరి విచారణపై ఆధారపడి ఉంది. అషురెడ్డి వాదనలు నిజమా లేక ఎన్నారై ఆరోపణల్లో వాస్తవం ఉందా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)