అందుకే డౌట్స్ : డ్రగ్స్ కేపీతో ఎక్కువ మాట్లాడింది ఆషు, సురేఖా

అందుకే డౌట్స్ : డ్రగ్స్ కేపీతో ఎక్కువ మాట్లాడింది ఆషు, సురేఖా

నిర్మాత కె.పి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి డ్రగ్స్ కేస్ టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న చాలా మంది ప్రముఖులతో కె.పి చౌదరికి  పరిచయాలు ఉన్నట్లు విచారణలో తెలిసిందని సమాచారం. వారితో కొన్ని వందల సార్లు కె.పి చౌదరి మాట్లాడినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఇక తాజాగా ఈ లిస్టులో బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమెతో కె.పి చౌదరి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు పోలీసులు. అంతేకాదు కె.పి చౌదరితో ఆషు రెడ్డి క్లోజ్ గా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. దీంతో ఆషు రెడ్డి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

ఇక పోలీసులు సైతం.. అదే కోవలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అసలు కె.పి చౌదరికి ఆషు రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అన్ని వందల సార్లు ఆమెతో మాట్లాడాల్సిన ఆవసం ఏంటీ? అనే అంశంపై వివరాలు రాబడుతున్నారు. ఈ డ్రగ్స్ వ్యవహారం ఆషుకి ముందే తెలుసా? తెలిస్తే పోలీసులకు ఎందుకు ఇంఫార్మ్ చేయలేదు అనే చర్చ కూడా నడుస్తుంది. కేపీ చౌదరి చాలా మందితో దిగిన ఫొటోలు బయటకు వస్తున్నా.. కేవలం సురేఖ వాణి.. ఆషురెడ్డి పేర్లు మాత్రమే హైలెట్ కావటం విశేషం. సురేఖ వాణి, ఆషురెడ్డిలకు నోటీసులు ఇచ్చి.. వాళ్లను విచారణ చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి అయితే.. డ్రగ్స్ తో లింక్ ఉందా లేదా అనేది తేలాల్సిన అంశం. 

ఇక డబ్స్మాష్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆషు.. నితిన్ హీరోగా నటించిన చల్ మోహన్ రంగా సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ అవకాశంతో మరింత క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రావడంలేదు. అయితే పెద్దగా అవకాశాలు లేకపోయినా.. ఆమె లగ్జరీ లైఫ్ గడుపుతూ కనిపించడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్టులు దాగి ఉన్నాయో? ఎన్ని సంచలన నిజాలు బయటపడనున్నాయో చూడాలి.