V6 News

18 పంచాయతీల్లో ఎమ్మెల్యే జారే ప్రచారం

18 పంచాయతీల్లో  ఎమ్మెల్యే జారే ప్రచారం

ములకలపల్లి, వెలుగు :  పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల గెలుపు కోసం మంగళవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  మండలంలోని 18 గ్రామాల్లో  ప్రచారం చేశారు. పలు సభల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఆయా పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్రావు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, ఓబీసీ మహిళా నాయకురాలు హారిక నాయుడు, పువ్వాల మంగపతి, గాడి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.