
తెలుగు స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ, టీవీ యాంకర్ ఓంకార్ (Omkar).ప్రముఖ టెలివిజన్ షోలను నిర్మించి, హోస్ట్ చేయడంలో సక్సెస్ ఫుల్ అయ్యారు. తాజాగా ఆయన తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శివం భజే’. మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్, టీజర్ అండ్ ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు అశ్విన్. ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ అప్డేట్ వచ్చేసింది.
రీసెంట్గా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్‌ను అందించారు. శివం భజే మూవీ నిడివి 2 గంటల 6 నిమిషాలతో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రీ మూవీస్ నైజాం ఏరియాలో రిలీజ్ చేయనుంది. శివం భజే కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే కాకుండా అశ్విన్ రీసెంట్ మూవీ హిడింబా క్రియేట్ చేసిన ర్యాంప్ దృష్ట్యా మైత్రీ మూవీస్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
Get ready for an action-packed thrilling ride with a divine intervention ❤?
— Mythri Movie Distributors LLP (@MythriRelease) July 29, 2024
ICYM the Trailer!
▶️ https://t.co/f3NQjaIJMD#ShivamBhaje NIZAM RELEASE BY @MythriRelease ??
In cinemas August 1st.#ShivamBhajeOnAUG1st ?️@imashwinbabu @DiganganaS @arbaazSkhan @apsardirector pic.twitter.com/bzSnkb8Y7f
అంతేకాకుండా వర్ణిక విజువల్స్ (డిస్ట్రిబ్యూషన్ సంస్థ) ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. కాగా ఓవర్సీస్ లో ఒక రోజు ముందు అనగా బుధవారం జూలై 31న ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది.
'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.
శివం భజే అని ఈ సినిమాకు ఆధ్యాత్మికమైన టైటిల్‌ను పెట్టినా..వరుస హత్యలతో, టెర్రరిజం ఆగడాల నేపథ్యంలో ట్రైలర్ అదిరిపోయింది. అలాగే, ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ పొందడానికి కారణం లేకపోలేదు. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ లో సినిమా నేపధ్యాన్ని చూపించడమే.
'వరల్డ్ మ్యాప్ లో ఇండియా కనుమరుగు అయిపోవాలి' అంటూ 'శివం భజే' ట్రైలర్ స్టార్టింగ్ లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో వినిపించగా..ఆ వెంటనే తీవ్రవాదుల్ని చూపించారు. ఇక ఆ పాకిస్తాన్ తీవ్రవాదులతో పాటు డ్రాగన్ దేశానికి చెందిన అధికారులను కూడా ట్రైలర్ లో చూపించడంతో అసలు చైనా పాత్ర ఏమిటి? అనేది కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
అలాగే వరుస హత్యలతో మరో క్రైమ్ యాంగిల్ చూపించడంతో ట్రైలర్ మరో యూ టర్న్ తీసుకుంది. 'ఈ మధ్య మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు' అని హీరోయిన్ దిగంగనా చెప్పడం..'చంపే చెయ్యి కనిపిస్తుంది గానీ చంపింది ఎవరో తెలియడం లేదు' అని హీరో చెప్పడం చూస్తుంటే ఆయన మీద అనుమానం కలిగించేలా ఉంది. ఇక ఇవన్నీ అంశాలు కలిగి ఉండటంతో U/A సర్టిఫికెట్ పొందింది.
గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ సోదరుడు అర్పాజ్ ఖాన్ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు అర్పాజ్ ఖాన్. ఆ తర్వాత 2017లో రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో విలన్ గా నటించాడు. అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తుంది.