Asia Cup 2023: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

Asia Cup 2023: టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి

ఇండియా - పాకిస్థాన్‌ మ్యాచ్ అంటే.. ఏ రేంజ్‌లో ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరు దేశాల అభిమానులే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకుల కళ్లన్నీ ఈ మ్యాచ్‌వైపే ఉంటాయి. సరిగ్గా మరో 22 రోజుల్లో అనగా సెప్టెంబర్ 2న.. మరోసారి అలాంటి క్షణాలు  తెరమీద కనిపించనున్నాయి. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 2న శ్రీలంక గడ్డపై దాయాది దేశాలు తలపడున్నాయి. 

భారత జెర్సీపై పాక్ పేరు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆసియా కప్ టోర్నీకి ఈసారి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అందులో భాగంగానే హోస్ట్ కంట్రీ పేరు.. ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జట్ల జెర్సీలపై ముద్రిస్తారు. అందువల్లే టీమిండియా ఆసియా కప్ జెర్సీపై పాకిస్తాన్ పేరు కనిపిస్తోంది. ఆసియా కప్ లోగో కింద పాకిస్థాన్ పేరు ఉంది. అయితే భారత జట్టు ఇదే జెర్సీతో బరిలోకి దిగుతుందా? లేదా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ టోర్నీకి శ్రీలంక సహ-హోస్ట్‌గా ఉండనుంది. కొత్త జెర్సీలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏదేమైనా టీమిండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు ముద్రించడం భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. గతంలో కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినప్పటికీ.. ఇలా ముద్రించలేదని తెలుస్తోంది.

ఆసియా కప్ 2023 షెడ్యూల్

  • ఆగస్టు 30: పాకిస్థాన్ vs నేపాల్ (ముల్తాన్)
  • ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక (క్యాండీ)
  • సెప్టెంబర్ 2: ఇండియా vs పాకిస్తాన్ (క్యాండీ)
  • సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)
  • సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్ (క్యాండీ)
  • సెప్టెంబర్ 5: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (లాహోర్)

సూపర్ 4s:

  • సెప్టెంబర్ 6: A1 vs B2 (లాహోర్)
  • సెప్టెంబర్ 9: B1 vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 10: A1 vs A2 (కొలంబో)
  • సెప్టెంబర్ 12: A2 vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 14: A1 vs B1 (కొలంబో)
  • సెప్టెంబర్ 15: A2 vs B2 (కొలంబో)
  • సెప్టెంబర్ 17: ఫైనల్ (కొలంబో)

ఆసియా కప్ మ్యాచ్‌లు అన్ని భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.