
ఆసియా కప్ కు రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ఈ మెగా టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. నేడు (సెప్టెంబర్ 9) తొలి మ్యాచ్ లో గ్రూప్-బి లో ఆఫ్ఘనిస్తాన్ తో హాంగ్ కాంగ్ తలపడనుంది. యూఏఈ లోని అబుదాబి, దుబాయ్ వేదికలుగా మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 28న ముగుస్తోంది. 20 రోజుల పాటు ఈ మినీ వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది.
ఆసియా కప్ పూర్తి షెడ్యూల్
గ్రూప్-ఏ
సెప్టెంబర్ 10 - భారత్ vs యుఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 12 - పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్)
సెప్టెంబర్ 14 - భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 15 - యుఎఇ vs ఒమన్ (అబుదాబి)
సెప్టెంబర్ 17 - పాకిస్తాన్ vs యుఎఇ (దుబాయ్)
సెప్టెంబర్ 19 - భారత్ vs ఒమన్ (అబుదాబి)
గ్రూప్-బి
సెప్టెంబర్ 9 - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 11 - బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబుదాబి)
సెప్టెంబర్ 13 - బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబుదాబి)
సెప్టెంబర్ 15 - శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్)
సెప్టెంబర్ 16 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)
సెప్టెంబర్ 18 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)
సూపర్ 4
సెప్టెంబర్ 20 - బి1 vs బి2 (దుబాయ్)
సెప్టెంబర్ 21 - AI vs A2 (దుబాయ్)
సెప్టెంబర్ 23 - A2 vs B1 (అబుదాబి)
సెప్టెంబర్ 24 - A1 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 25 - A2 vs B2 (దుబాయ్)
సెప్టెంబర్ 26 - A1 vs B1 (దుబాయ్)
సెప్టెంబర్ 28 - ఫైనల్ (దుబాయ్)
ఆసియా కప్ లో ఇండియా మ్యాచ్ ల షెడ్యూల్:
సెప్టెంబర్ 10 - భారత్ vs యుఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 14 - భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 19 - భారత్ vs ఒమన్ (అబుదాబి)
8 గంటల నుంచి మ్యాచ్ లు
ఆసియా కప్ మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ మ్యాచ్ లు రాత్రి 7:30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉంది. మరో అరగంట పెంచి కీలక మార్పు చేసింది. సెప్టెంబర్ 15న అబుదాబిలో యుఎఇ, ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఒక్కటే సాయంత్రం 5:30 గంటలకు (స్థానిక సమయం సాయంత్రం 4:00) గంటలకు ప్రారంభమవుతుంది. యూఏఈలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
ఆసియా కప్ లైవ్ టెలికాస్ట్ ఇండియాలోని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. సోనీ లైవ్ ఆప్ లో లైవ్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.
ఆసియా కప్ వేదికలు:
షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి)
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(దుబాయ్)