
ఆసియా కప్ లో సూపర్-4 కు వెళ్లే జట్లేవో తేలిపోయింది. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 ఆడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ కాంటినెంటల్ టోర్నీలో గ్రూప్-ఏ నుంచి ఇండియా, పాకిస్థాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 కు అర్హత సాధించాయి. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఇండియా, ఒమాన్ మ్యాచ్ తో లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా అంటే శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సూపర్-4 రౌండ్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం..
నేడు టీమిండియాను ఒమన్ భారీ తేడాతో ఓడించినా సూర్య సేన టాప్ లోనే ఉంటుంది. భారీ నెట్ రన్ రేట్ ఉండడమే ఇందుకు కారణం. రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇండియాను ధాటి పైకి రావాలంటే నేడు ఒమన్ తో జరగబోయే మ్యాచ్ లో ఇండియా దాదాపు 120 పరుగుల తేడాతో ఓడిపోవాలి. ఇది దాదాపు అసాధ్యం. దీంతో గ్రూప్-ఆ నుంచి ఇండియా ఏ1 గా పాకిస్థాన్ ఏ2 గా సూపర్-లో ఆడనున్నాయి. గ్రూప్- బి నుంచి టాప్ లో ఉన్న శ్రీలంక బి1 గా.. బంగ్లాదేశ్ బి2 గా బరిలోకి దిగనున్నాయి. టోర్నీ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ లో గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 లో తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆదివారం (సెప్టెంబర్ 21) మ్యాచ్ జరగనుంది.
సోమవారం నాలుగు జట్లకు రెస్ట్ ఇస్తారు. ఆ రోజు ఎలాంటి మ్యాచ్ లు ఉండవు. మంగళవారం (సెప్టెంబర్ 23) పాకిస్థాన్ తో శ్రీలంక.. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియా, బంగ్లాదేశ్.. గురువారం (సెప్టెంబర్ 25) బంగ్లాదేశ్ తో పాకిస్థాన్.. శుక్రవారం (సెప్టెంబర్ 26) ఇండియా, శ్రీలంక మ్యాచ్ లు ఉంటాయి. ఆరు మ్యాచ్ ల్లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ అబుదాబిలో జరుగుతుంది. మిగిలిన మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయి. రౌండ్ రాబిన్ లో జరగబోయే సూపర్-4 లో టాప్-2 లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కు చేరతాయి. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా ఫైనల్ జరుగుతుంది.
ఆసియా కప్ 2025 - సూపర్-4 షెడ్యూల్:
సెప్టెంబర్ 20: శ్రీలంక vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm
సెప్టెంబర్ 21: భారత్ vs పాకిస్థాన్ - దుబాయ్ - రాత్రి 8:00
సెప్టెంబర్ 23: పాకిస్థాన్ vs శ్రీలంక - అబుదాబి - రాత్రి 8:00
సెప్టెంబర్ 24: భారతదేశం vs బంగ్లాదేశ్ - దుబాయ్ - 8:00pm
సెప్టెంబర్ 25: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - దుబాయ్ - రాత్రి 8:00 IST
సెప్టెంబర్ 26: భారత్ vs శ్రీలంక - దుబాయ్ - రాత్రి 8:00
సెప్టెంబర్ 28: ఫైనల్ - దుబాయ్ - రాత్రి 8:00
Matches on consecutive days for Bangladesh in the Super Four schedule.
— ESPNcricinfo (@ESPNcricinfo) September 19, 2025
Which two teams will make the final? #AsiaCup2025 pic.twitter.com/mHLpqMFvNx