Asia Cup 2025: ఆసియా కప్ 2025.. గ్రూప్-ఏ, గ్రూప్-బి స్క్వాడ్ వివరాలు.. సూపర్-4కు వెళ్ళేది ఆ నాలుగు జట్లేనా..

Asia Cup 2025: ఆసియా కప్ 2025.. గ్రూప్-ఏ, గ్రూప్-బి స్క్వాడ్ వివరాలు.. సూపర్-4కు వెళ్ళేది ఆ నాలుగు జట్లేనా..

క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ఆసియా కప్ సిద్ధంగా ఉంది. మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. తొలిసారిగా ఎనిమిది జట్లు తలపడుతున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.  2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబి వేదికలుగా జరగనున్నాయి. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది. సూపర్ 4 సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతుంది.  

గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది. దుబాయ్‌ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది.   


గ్రూప్-ఏ:
  
ఆసియా కప్ గ్రూప్-ఏ లో ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్ లో రెండు జట్లు సూపర్-4 కు అర్హత సాధించనున్నాయి. ఈ గ్రూప్ లో ఇండియా, పాకిస్థాన్ కు తిరుగులేదనిపిస్తోంది. ఈ రెందు జట్లు సూపర్-4 కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యూఏఈ, ఒమన్ జట్లు పాకిస్థాన్, ఇండియా జట్లను ఓడించడం దాదాపుగా అసాధ్యం. ఆతిధ్య జట్టు యూఏఈ ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. ఈ గ్రూప్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగబోయే మ్యాచ్ హైలెట్ గా నిలవనుంది.                   

ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్)  అక్షర్ పటేల్, రింకూ సింగ్,  జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రానా.

పాకిస్థాన్

సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హరీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా, సలీమ్, ఫర్హాన్ అఫ్రిది, సుఫ్యాన్ 
మొకిమ్.

యుఎఇ:

ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), ముహమ్మద్ జోహైబ్, ఆసిఫ్ ఖాన్, అలీషాన్ షరాఫు, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), హర్షిత్ కౌశిక్, హైదర్ అలీ, ముహమ్మద్ ఫరూఖ్, ముహమ్మద్ రోహిత్ ఖాన్, జునైద్ సిద్ధిక్, సిమ్రంజీత్ సింగ్, ఈతాన్ డిసౌజా, ధ్రువ్ పరాశర్, ముహమ్మద్ జవదుల్లా ఖాన్, మహ్మద్ జవాదుల్లా ఖాన్

ఒమన్:

జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా (వికెట్ కీపర్), వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), సుఫ్యాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెడెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సుఫ్యాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జిక్రియా ఇస్లాం, హస్నైన్ అలీ, షహ్కెరాన్, ఫైసల్ ఇమ్, షహమ్, ఫైసల్, సమయ్ శ్రీవాస్తవ.

గ్రూప్-బి  

ఆసియా కప్ లో గ్రూప్-బిను క్రికెట్ ఎక్స్ పర్ట్స్ "గ్రూప్ ఆఫ్ డెత్" గా పరిగణిస్తున్నారు. గ్రూప్-బిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, హాంగ్ కాంగ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. వీటిలో హాంగ్ కాంగ్ ను పక్కన పెడితే ఏ రెండు జట్లు సూపర్-4 కు అర్హత సాధిస్తాయో చెప్పడం కష్టం. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఏ జట్టును తక్కువగా అంచనా వేయలేం. తమదైన రోజున ఈ మూడు జట్లు ఏ జట్టునైనా ఓడించగలవు. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఈ గ్రూప్ లో సూపర్-4 కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.                   


శ్రీలంక: 

చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా (వికెట్ కీపర్), నువానీడు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిషార (వికెట్ కీపర్), దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, ఎఫ్ నుషేక్ థీక్‌నన్, మహేశ్ తీక్‌నన్, ఎఫ్. తుషార, మతీషా పతిరన.

బంగ్లాదేశ్:

లిట్టన్ దాస్ (కెప్టెన్, వికెట్ కీపర్), తాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ (వికెట్ కీపర్), సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్ (వికెట్ కీపర్), షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్ (వికెట్ కీపర్), షక్ మహేదీ హసన్, ముస్త్ హుస్సేన్, నస్త్ హుస్సేన్, హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్

ఆఫ్ఘనిస్తాన్:

రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ

ALSO READ : వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్..

హాంకాంగ్:

యాసిమ్ ముర్తజా (కెప్టెన్), బాబర్ హయత్, జీషన్ అలీ (వికెట్ కీపర్), నియాజకత్ ఖాన్ మహ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రాత్ (వికెట్ కీపర్), కల్హన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశిష్ శుక్లా, మహ్మద్ ఐజాజ్ ఖాన్, అతీఖ్ ఉల్ రెహ్బాల్, ఖీన్‌చి ఇక్‌బాల్, మహ్మద్ ఐజాజ్ ఖాన్ మహ్మద్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వాసిఫ్ (వికెట్ కీపర్), గజన్ఫర్ మహ్మద్, మహ్మద్ వహీద్, అనాస్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్

ఆసియా కప్ పూర్తి షెడ్యూల్


సెప్టెంబర్ 9 - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ (అబుదాబి)

సెప్టెంబర్ 10 - భారత్ vs యుఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 11 - బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబుదాబి)

సెప్టెంబర్ 12 - పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్)

సెప్టెంబర్ 13 - బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబుదాబి)

సెప్టెంబర్ 14 - భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 15 - యుఎఇ vs ఒమన్ (అబుదాబి) మరియు శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్)

సెప్టెంబర్ 16 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)

సెప్టెంబర్ 17 - పాకిస్తాన్ vs UAE (దుబాయ్)

సెప్టెంబర్ 18 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)

సెప్టెంబర్ 19 - భారత్ vs ఒమన్ (అబుదాబి)

సూపర్- 4

సెప్టెంబర్ 20 - బి1 vs బి2 (దుబాయ్)

సెప్టెంబర్ 21 - AI vs A2 (దుబాయ్)

సెప్టెంబర్ 23 - A2 vs B1 (అబుదాబి)

సెప్టెంబర్ 24 - A1 vs B2 (దుబాయ్)

సెప్టెంబర్ 25 - A2 vs B2 (దుబాయ్)

సెప్టెంబర్ 26 - A1 vs B1 (దుబాయ్)

సెప్టెంబర్ 28 - ఫైనల్ (దుబాయ్)