
సొలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం ఉత్కంఠగా సాగిన నాకౌట్ పోరులో 104–-110తో మాజీ చాంపియన్ జపాన్ చేతిలో పోరాడి ఓడింది. ఓపెనింగ్ మ్యాచ్‌లో 9–11తో ఓడిన తర్వాత ఇండియా షట్లర్లు పుంజుకున్నారు. బాయ్స్ డబుల్స్‌లో భార్గవ్ రామ్, విశ్వ తేజ్, గర్ల్స్ డబుల్స్‌లో వెన్నెల– రేశిక ఉదయ నెగ్గి ఇండియాను 33–-26 ఆధిక్యంలోకి తెచ్చారు. కానీ, చివరి దశలో జపాన్ వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలుచుకుని సెమీస్‌లో అడుగు పెట్టింది. బుధవారం నుంచి జరిగే వ్యక్తిగత పోటీల్లో ఇండియా షట్లర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.