ఉలాన్‌బాటర్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా బాక్సర్ విశ్వనాథ్ సురేష్ సంచలన విజయం సాధించాడు. వరల్డ్ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ సంజార్ తాష్కెన్‌బే (కజకిస్తాన్)ను ఓడించి సెమీఫైనల్ చేరి మెడల్ ఖాయం చేసుకున్నాడు. శనివారం జరిగిన మెన్స్ 50 కేజీ క్వార్టర్ ఫైనల్లో విశ్వనాథ్ 5-0తో సంజార్‌ను చిత్తు చేశాడు.
నరేందర్ (90+ కేజీ) 5–-0తో యూఏఈ బాక్సర్ ఓర్ఖాన్ అఘాయేవ్‌పై, సచిన్ (60 కేజీ) 5–0తో చెంగ్ వి లీ (తైపీ)పై గెలిచి సెమీస్ చేరగా.. ఆదిత్య (65 కేజీ) 0-–5తేడాతో మడమినోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టాడు. విమెన్స్ 65 కేజీ బౌట్‌లో అంకుషిత బోరో 4-–1తో లారా ఎస్సెంకెల్డి (కజకిస్తాన్) ను ఓడించి ముందంజ వేసింది.
