తాష్కెంట్: ఇండియా బాక్సర్ లక్ష్యయ్ ఫోగట్.. ఆసియా అండర్–17 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మెన్స్ 75 కేజీల సెమీస్‌లో లక్ష్యయ్ 5–0తో సీంగ్‌మిన్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయం సాధించాడు. సెమీస్‌లో ఓడిన మరో నలుగురు బాక్సర్లు కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
46 కేజీల్లో నరేంద్ర నెల్లా 0–5తో అబ్దుల్లో (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 50 కేజీల్లో యశ్ యాదవ్ 1–4తో సుల్ద్ (మంగోలియా) చేతిలో, 54 కేజీల్లో నివేష్ పాల్ 0–5తో అబ్దుల్బోసిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 70 కేజీల్లో నమన్ 2–3తో అబ్దువోహిద్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
