
ఆసియా క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 71 పతకాలు సాధించింది. ఇవాళ(అక్టోబరు 4) జరిగిన ఆర్చరీలో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం ఓజాస్ డియోటాలే బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఫుయాంగ్ యిన్హు స్పోర్ట్స్ సెంటర్ ఫైనల్ ఫీల్డ్‌లో దక్షిణ కొరియా జోడీ సో చెవాన్, జూ జేహూన్‌లను ఓడించారు.
Also Read :- రూ.100 పెట్టి కొంటే కోటిన్నర తగిలింది
జ్యోతి , ఓజాస్ సాధించిన స్వర్ణంతో భారతదేశం 71వ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇది ఆసియా క్రీడల చరిత్రలో అత్యధికం. 2018 జకార్తా గేమ్స్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించింది. నాలుగేళ్ల త్వర్వాత 16 బంగారు పతకాలను భారత్ సాధించింది.