ఆసిఫాబాద్, వెలుగు: సీఏఆర్ఏ(కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ) రూల్స్‌కు అనుగుణంగా పిల్లలను దత్తత తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత సూచించారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన దుర్గం లింగయ్య, రేణుక దంపతులకు అడాప్షన్ ఆర్డర్ కాపీని అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూదత్తతతో పిల్లలకు ప్రేమ, భద్రత, విద్య, మంచి భవిష్యత్తు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. డీడబ్ల్యూవో స్వరూపా రాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్, ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
